ముంబై :స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలతోనే వ్యాపారాల్ని ఆరంభించాయి. ఉదయం 9.16 గంటలకు సెన్సెక్స్ 1,555 పాయింట్లు నష్టపోయి 27,314 వద్ద, నిఫ్టీ 493 పాయింట్లు నష్టపోయి 7,975 నిలిచాయి. అంతర్జాతీయ మార్కెట్లో భారీగా చమురు ధరలు పడి పోవ డం, అమెరికా మార్కెట్లో నష్టాలు కొనసాగడంతో మదు పర్లు వాటాల అమ్మకానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. రిలయన్స్ 4 శాతం ఎస్బీఐ 5 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 7 శాతం, వంతున విలువ కోల్పోయాయి.