న్యూఢిల్లీ: రాజధానిని చలి పులి వణికిస్తోంది. దాదాపు 120 సంవత్సరాల తరువాత ఈ నెల్లో అతి తక్కువ ఉష్ణోగ్రతలు దాఖలు కానుందని దని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే అధిక ఉష్ణోగ్రత 12.10 డిగ్రీలకు పడిపోయింది. ఇది ఇంకా తగ్గు తుందని అంచనా. ఈ ఏడాది సరాసరి గరిష్ఠ ఉష్ణోగ్రత 19.85 డిగ్రీలకు తగ్గింది. అది 1997 డిసెంబర్ లో 17.30 డిగ్రీ లు. 1901-2018 మధ్య 1919, 1929, 1961, 1997 సంవత్సరాల్లో గరిష్ఠ సరాసరి ఉష్ణోగ్రత 20 డిగ్రీల కంటే తగ్గింది. ఈ నెల 18న సఫ్దర్ గంజ్ ప్రాంతంలో 12, పాలమ్ ప్రాంతంలో 11.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. 29 నుంచి మరింతగా ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అధికారులు హెచ్చరించారు. డిసెంబరు 31న వర్షం కురిసే అవకాశాలున్నాయి.