ముంబై:మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు కోసం కనీస ఉమ్మడి కార్యక్రమానికి (కామన్ మినిమం ప్రోగ్రాం) శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీల అధినేతలు అంగీకారించారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం వారు గవర్నర్ ను కలవ నున్నారు. ముఖ్య మంత్రి పదవిని పూర్తిగా ఐదేళ్లపాటు శివసేనకు ఇచ్చేందుకు ఎన్సీపీ, కాంగ్రెస్ ఒప్పుకున్నాయి. కాంగ్రెస్కు శాసనసభ సభా పతి, ఎన్సీపీకి శాసన మండలి అధ్యక్ష పదవిని లభించనున్నాయి. శివసేనకు ముఖ్యమంత్రి పదవితో సహా 14 మంత్రి పదవులు, ఎన్సీపీకి ఉపముఖ్యమంత్రి పదవితో సహా 14 మంత్రి పదవులు, కాంగ్రెస్కు ఉపముఖ్యమంత్రి పదవితో సహా 12 మంత్రి పదవులు దక్కనున్నాయి.