కాఫీ తాగితే వీటి ముప్పు తప్పినట్టే

కాఫీ తాగితే వీటి ముప్పు తప్పినట్టే

న్యూఢిల్లీ: రోజుకు మూడు కప్పుల కాఫీ తాగిన వాళ్లలో జీవన శైలి సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటున్నదని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. డయాబెటిస్‌, గుండె సమస్యల బారిన పడే ముప్పు 40 నుంచి 50శాతం వరకు తగ్గుతుందని తెలిపింది. రోజూ కాఫీ, టీ తాగిన 1.88 లక్షల మంది డాటాను చైనాకు చెందిన సుజో మెడికల్‌ కాలేజీ సైంటిస్టులు విశ్లేషించారు. రోజుకు మూడు కప్పుల కాఫీ తీసుకున్న వాళ్లలో గుండెపోటు, హై బీపీ, మధుమేహం.. మొదలైన సమస్యల ముప్పు తగ్గినట్టు పరిశోధకులు గుర్తించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos