ఆసీస్ బౌలింగ్ కోచ్ డేవిడ్ సాకర్ తన పదవికి రాజీనామా
చేశారు. ప్రపంచ్ కప్‌నకు జట్టు సన్నద్ధం కావాల్సిన తరుణంలో ఆయన రాజీనామా క్రికెట్
ఆస్ట్రేలియాను దిగ్భ్రాంతికి గురి చేసింది. వెంటనే ఆయన స్థానంలో గతంలో ఇంగ్లండ్ బౌలింగ్
కోచ్‌గా పని చేసిన ట్రాయ్ కూలీని ఎంపిక చేసింది. భారత్ తో పాటు పాక్ సిరీస్‌కు ఆయన
బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తారు. ప్రపంచ కప్ వరకు ఈయననే కొనసాగిస్తారా అనేది తేలాల్సి
ఉంది.