ప్రస్తుతం దేశంలో విపరీతంగా వినిపిస్తున్న పదం లవ్ జిహాద్.పేర్లు మార్చుకొని ముస్లిం యువకులు హిందూ అమ్మాయిలను పెళ్లి చేసుకొని అటుపై మతం మార్చుకోవాలని వేధించడం లేదంటే హత్య చేస్తున్న ఘటనలు దేశ వ్యాప్తంగా పెరుగుతున్నాయి. ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో నికిత అనే అమ్మాయి హత్య కూడా లవ్ జిహాద్ లో జరిగిందనే ఆరోపణలు,వార్తలు వస్తుండడంతో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారింది.లవ్ జిహాద్ పేరిట హిందూ యువతులపై కన్నేస్తే వారికి అంతిమయాత్రేనని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. యూపీలో మతాంతర కార్యకలాపాలను పూర్తిగా నివారించేందుకు యోగి ప్రభుత్వం తీవ్ర కసరత్తలు మొదలుపెట్టింది. ఈ మేరకు కఠిన చట్టాలు చేయనున్నట్లు సీఎం యోగి ఆధిత్యనాథ్ తెలిపారు.ఒకవేళ వినకపోతే వారికి అంతిమ యాత్ర మొదలైనట్లేనని యూపీ సీఎం తీవ్రంగా హెచ్చరించారు. పెళ్లి కోసం మత మార్పిడి అవసరం లేదని అలహాబాద్ కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఈ వ్యాఖ్యలు చేశారు.యూపీలోని మల్హానీ అసెంబ్లీ స్థానానికి నవంబర్ 3న ఉప ఎన్నికల జరుగనున్న నేపథ్యంలో శనివారం చేపట్టిన ఎన్నికల ప్రచారంలో యోగి పాల్గొని ఈ హెచ్చరికలు పంపారు.లవ్ జిహాద్ ను అరికట్టేందుకు యూపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని.. ఈ మేరకు తమ ప్రభుత్వం కఠినమైన చట్టాన్ని తీసుకువస్తుందంటూ యోగి ఆధిత్యనాథ్ పేర్కొన్నారు. ఆడబిడ్డలతో ఎవరూ ఆటలాడినా వారికి అంతిమయాత్ర నిర్వహిస్తామని గట్టిగా హెచ్చరించారు. ఈ మేరకు పోస్టర్లను కూడా అంటిస్తామని స్పష్టం చేశారు.