మతిపోగొడుతున్న సీఎం రమేశ్ తనయుడి నిశ్చితార్థం ఏర్పాట్లు..

మతిపోగొడుతున్న సీఎం రమేశ్ తనయుడి నిశ్చితార్థం ఏర్పాట్లు..

రాజ్యసభ బీజేపీ సభ్యుడు సీఎం రమేశ్‌ తనయుడి నిశ్చితార్థంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆహ్వానితులు,అథిధుల కళ్లుబైర్లు కమ్మేలా దుబాయ్‌లో తనయుడి నిశ్చితార్థం వేడుకలు జరిపిస్తున్నారు.కుమారుడు రిత్విక్‌ నిశ్చితార్దానికి చేసిన ఏర్పాట్లు.. ఖర్చు చూసి.. ఔరా.. అనుకుంటున్నారు.అమెరికా కేంద్రంగా పలు వ్యాపారాలు చేస్తున్న పారిశ్రామిక వేత్త రాజా తాళ్లూరి కుమార్తె పూజాతో నిశ్చితార్ధం ఖరారైన సమయం నుండి సీఎం రమేష్ ఈ వేడుక నిర్వహణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీనిని దుబాయ్ లో నిర్వహణ కోసం నెల రోజులుగా ఏర్పాట్లు మొదలు పెట్టారు. అందులో భాగంగా..దుబాయ్ లోని వాల్డాఫ్ర్ అస్టోరియా, రసాల్ ఖైమా లో వేదిక ఖరారు చేశారు.అందు కోసం సీఎం రమేష్ పార్లమెంట్ లోని ఎంపీలతో పాటుగా అతిరధ మహారధులను ఆహ్వానించారు.సీఎం రమేష్ తన కుమారుడి నిశ్చితార్ధానికి పెద్ద సంఖ్యలో ప్రముఖులను ఆహ్వానించారు. ఏపీలోని అన్ని పార్టీలకు చెందిన నేతలతో పాటుగా ప్రధానంగా ఢిల్లీలో బీజేపీ నేతలను పేరు పేరునా ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది.అథిధులు దుబాయ్ చేరుకోవటానికి ప్రత్యేకంగా 15 విమానాలను ఏర్పాటు చేశారు.అతిధులకు స్వాగలం పలికేందుకు దుబాయ్ ఏయిర్ పోర్టు నుండి వారికి కేటాయించిన బస వరకు వారిని తోడ్కొని వెళ్లటానికి ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. నిశ్చితార్ధం నిర్వహణ బాధ్యతలను ప్రముఖ అంతర్జాతీయ సంస్థకు అప్పగించారు. అదే విధంగా..సెలబ్రేషన్స్ నిర్వహణ..అతిధుల మేనేజ్ మెంట్ బాధ్యతలు..ఇలా ఒక్కో సంస్థకు ఒక్కో పని అప్పగించారు. దుబాయ్ లో మకాం వేసిన సీఎం రమేష్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను స్వయంగా పరిశీలిస్తున్నారు.బీజేపీతో పాటు తెదేపా,వైసీపీ నేతలకు కూడా ఆహ్వానాలు అందాయి..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos