కోల్ కతా: పశ్చిమ బంగ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ బుధవారం ప్రమాణం చేశారు. కరోనా కారణంగా రాజ్భవన్లో ఉదయం 10.45 గంటలకు నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జగదీప్ ధన్కడ్ ఆమెతో ప్రమాణాన్ని చేయించారు. మేనల్లుడు, తృణమూల్ లొక్సభ సభ్యుడు అభిషేక్ బెనర్జీ, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తదితరులు హాజరయ్యారు.