నేరస్థుడితో సినీతారలకు ఏంటిపని??

నేరస్థుడితో సినీతారలకు ఏంటిపని??

రాజకీయ నేతలకు,సినీ తారలకు ,క్రికెటర్లకు ఒకరికతో ఒకరికి స్నేహం
తప్పకుండా ఉంటుంది.అసలు ఈ మూడు రంగాలకు ఒకదాటితో మరొకదానికి విడదీయలేని అవినాభావ సంబంధం
ఉంటూనే ఉంటుంది.ఈ బంధాన్ని నిజమని రుజువు చేసేలా ఇప్పటికే ఎన్నో ఘటనలు జరిగాయి,జరుగుతున్నాయి
ఇకపై జరగబోతాయి కూడా.ముఖ్యంగా రాజకీయాల్లో సినీ తారల ప్రమేయం ఎప్పుడూ ఉంటుంది.ఎన్నికలు
సమీపిస్తే ఏ రాష్ట్రంలోనైనా సినీతారల హడావిడి కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది.అందుకు
తెలుగు చిత్ర పరిశ్రమ మినహాంపేమి కాదు. చాలా మంది సినీ తారలు వారికి నచ్చిన రాజకీయ
పార్టీలకు మద్దత్తు తెలపడం చూస్తూనే ఉన్నాం. తాజాగా కింగ్ నాగార్జున మంగళవారం రోజు
ఏపీ ప్రతి పక్ష నేత వైయస్ జగన్ తో భేటీ కావడం సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా
మారింది.
ఫిబ్రవరి 19న అక్కినేని నాగార్జున లోటస్ పాండ్ లో
వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. దీని గురించి సమాచారం రాగానే నాగార్జున రాజకీయ ప్రవేశం
అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వైసిపి తరుపున ఎంపీ అభ్యర్థిగా నాగ్ బరిలో దిగబోతున్నట్లు
ఊహాగానాలు జోరందుకున్నాయి. వీరిద్దరి భేటీపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు.
నాగార్జున, జగన్ భేటీని ఉద్దేశిస్తూ చంద్రబాబు కామెంట్స్
చేశారు. నేరస్థులతో సినీతారల భేటీ దురదృష్టకరం. కొందరి హీరోలు నేరస్థుడికి సరెండర్
అవుతున్నారు. దీని వలన ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయి అని అన్నారు. పలు సందర్భాలలో
సినీతారలు, రాజకీయ నాయకులు కలుసుకోవడం కొత్త కాదు. కానీ నాగార్జున గతంలో కూడా ప్రత్యేకంగా
గుజరాత్ వెళ్లి నరేంద్ర మోడీని కలసిన సంగతి తెలిసిందే.జగన్ తో భేటీ గురించి
వస్తున్న వార్తలపై నాగార్జున స్పందించినట్లు తెలుస్తోంది. జగన్ నాకు మంచి స్నేహితుడు.
జగన్ విజయవంతంగా పాదయాత్ర పూర్తి చేశారు కాబట్టి అభినందించడానికి వెళ్ళాను అని చెప్పారట.
తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని నాగ్ అన్నట్లు వార్తలు వస్తున్నాయి. కొందరైతే నాగార్జున
గుంటూరు లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా బరిలోకి దిగుతారని ప్రచారం చేస్తున్నారు.
నాగార్జున వైసిపిలో చేరుతున్నట్లు వస్తున్న ఈ వార్తలు
కొత్తవి కాదు. గత రెండు మూడేళ్ళుగా ఇలాంటి వార్తలు వినిపిస్తున్నాయి. కానీ నాగార్జున
అవేమి పట్టించుకోకుండా తన సినిమాలతో బిజీగా గడుపుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos