డేటా చోరీ మహా కుట్ర…చంద్రబాబు

డేటా చోరీ మహా కుట్ర…చంద్రబాబు

అమరావతి : రోజు రోజుకు వివాదాస్పదమవుతున్న డేటా చోరీ వ్యవహారం…బాహుబలి సినిమాలోని కుట్రకు మించిన మహా కుట్ర అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. శనివారం దీనిపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కుట్రకు ఢిల్లీలో బీజం పడిందని, దిల్లీలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు మొదలుకుని, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఆంగ్ల దిన పత్రికలో వచ్చిన కథనం వరకు…అంతా విజయసాయి రెడ్డి డైరెక్షన్ లో జరిగిందని ఆరోపించారు. తర్వాత అశోక్‌ను విచారించారు. ఐటీ గ్రిడ్‌ కంపెనీలో సోదాలు చేశారు. ఇప్పుడేమో అడ్డంగా దొరికిపోయారు అని సీఎం వ్యాఖ్యానించారు. ఈ కుట్రలో వైకాపాతో పాటు బీజేపీ, తెరాస భాగస్వాములని ఆరోపించారు. వచ్చే ఎన్నికలు ఆంధ్రాలో కేసీఆర్‌ వర్సెస్‌ టీడీపీగా ఉండబోతున్నదని చెప్పారు. జగన్‌ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి హైదరాబాద్‌కు అమ్ముడుపోయారని ఆరోపించారు. కేసీఆర్‌ ఆంధ్రా ప్రజలను ఎన్నో సార్లు, ఎన్నో విధాలుగా అవమానించారని అన్నారు. ఏపీలో ప్రతిపక్షం లేదు. నేనే వస్తాను, తేల్చుకుంటాను…అని కేసీఆర్‌ చెప్పారు. కనుక రేపు ఏపీలో జరిగే ఎన్నికలు..కేసీఆర్‌, టీడీపీ మధ్యే అని ఆయన చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos