ప్రభుత్వ విద్యుత్‌ రంగాన్ని కాపాడుకోవాలి

ప్రభుత్వ విద్యుత్‌ రంగాన్ని కాపాడుకోవాలి

తిరుపతి : ప్రభుత్వ విద్యుత్‌ రంగాన్ని కాపాడుకోవాలని, ప్రైవేటీకరణ జరగకుండా ప్రతి ఒక్కరు ఐక్యతగా ఉండి అడ్డుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి తెలిపారు. బుధవారం పాత మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద సిఐటియు వినియోగదారులు దేశవ్యాప్తంగా విద్యుత్‌ ప్రైవేట్‌ ప్రైవేటీకరణ చేయకూడదని కోరుతూ ఆందోళన చేస్తున్నారని అందులో భాగంగా తిరుపతిలో చేస్తున్నట్టు వెల్లడించారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యుత్‌ రంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరణ చేసి ప్రజలపై భారాలు మోపడానికి కుట్రపన్నారని ఆరోపించారు ప్రధాని మోడీ చండీగర్‌ రాష్ట్రంలో విద్యుత్‌ రంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరణకు చర్యలు చేపట్టారు అన్నారు వారికి సంఘీభావంగా సిఐటియు దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగిస్తా ఉందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు విద్యుత్‌ చార్జీలు పెంచబోమని చెప్పి ఇప్పుడు 16 వేల కోట్ల రూపాయలు ప్రజలపై భారాలు మోపారు అని గుర్తు చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదానికి ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో స్మార్ట్‌ మీటర్లను బిగించకుండా రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రధాని మోడీ రాష్ట్రాల హక్కులను కాల రాస్తున్నారని విద్యుత్‌ ప్రయోగికరణతో రైతులకు ఉచిత విద్యుత్తు భవిష్యత్తులో ఉండగానే అలాగే పరిశ్రమలు కూడా పెను ప్రమాదం ఏర్పడిందని పేర్కొన్నారు.విద్యుత్‌ రంగాన్ని కాపాడుకోవడానికి విద్యుత్‌ ఉద్యోగులు,రైతు సంఘాలు వినియోగదారులు, వామపక్ష పార్టీలు పోరాట ఫలితంగా పార్లమెంట్లో విద్యుత్‌ సాధన చట్టాన్ని గత పది సంవత్సరాలుగా చేయలేకపోయిందని గుర్తు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos