

హైదరాబాద్ : సినీ నటుడు వెంకటేశ్ కుమార్తె ఆశ్రిత పెళ్లి
రిసెప్షన్ సందర్భంగా సినీ తారల హడావుడి బాగా కనిపించింది. చిరంజీవి, కృష్ణంరాజు దంపతులతో
పాటు ఖుష్బూ, నదియా, సుహాసిని, టబు, రాధిక,
జయసుధ, మీనా తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అప్పుడు తీసిన ఫొటోలను రాధిక, ఖుష్బూలు
సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఈ జ్ఞాపకాలు కలకాలం గుర్తుంటాయని, అలనాటి అగ్ర హీరోలు
చిరంజీవి, కృష్ణంరాజులతో సమయం సరాదాగా గడిచిందని రాధికా ట్వీట్ చేశారు.