కరోనాపై అవగాహనకు సాయికుమార్‌ షార్ట్‌ఫిలిం..

కరోనాపై అవగాహనకు సాయికుమార్‌ షార్ట్‌ఫిలిం..

కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించడానికి డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌ కుటుంబ సమేతంగా షార్ట్‌ఫిలింలో నటించి కరోనాపై పోరాటానికి తన వంతు సహకారం అందించారు. కుమారుడు ఆది, కుమార్తె జ్యోతిర్మయితో  కలిసి షార్ట్ ఫిలింను నిర్మించారు.ఇక కొడుకు, కూతురుతో పాటు తాను కూడా కలిసి షార్ట్ ఫిలింలో సాయికుమార్ నటించారు. డాక్టర్ పాత్రలో జ్యోతిర్మయి, పారిశుద్ధ్య కార్మికుడి పాత్రలో ఆది, పోలీసు పాత్రలో సాయికుమార్ నటించారు. పోలీస్, పబ్లిక్ ఒకటైతేకరోనాను తరిమివేయగలమని, ‘అంతిమ విజయం మనదేఅంటూ సాయికుమార్ తనదైన శైలిలో చెప్పారు.ఇక కరోనాపై పోరుకు కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) కి, డబ్బింగ్ అసోసియేషన్ కు ప్రముఖ నటుడు సాయికుమార్ తన వంతు విరాళాలు ఇచ్చిన విషయం తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos