తమ పాచికలు పారి కర్ణాటక రాష్ట్రంలో అధికారం చేజిక్కడంతో బీజేపీ అధిష్టానానికి దక్షిణాదిపై ఆశలు మరింత చిగురించాయి.అందులోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలపడడానికి దశాబ్దాల నుంచి ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ మరింత దూకుడు ప్రదర్శించడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో అధికార వైసీపీ పార్టీలోని కీలకనేతలను ధీటుగా ఎదుర్కోగలిగే నేతలను పార్టీలోకి చేర్చుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగా ఒకప్పటి హీరోయిన్ ప్రియా రామన్ను బీజేపీలో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.బీజేపీ నేతలు కూడ ఈ విషయమై ప్రియారామన్ తో చర్చించినట్టుగా చెబతున్నారు. తిరుపతిలో బుధవారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రియారామన్ బీజేపీలో చేరే విషయాన్ని ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. మరో వైపు బీజేపీలో చేరిన తర్వాత ఆమెను ఎక్కడి నుండి బరిలోకి దింపాలనే విషయమై పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకొంటుందని కాషాయవర్గాలు చెబుతున్నాయి.కాగా వైసీపీ మహిళ ఎమ్మెల్యే రోజాను ధీటుగా ఎదుర్కొనే ఉద్దేశంతో ప్రియా రామన్ను పార్టీలోకి తీసుకోవడానికి బీజేపీ అధిష్టానం నిర్ణయించుకున్నట్లు సమాచారం.వచ్చే ఎన్నికల్లో రోజాకు పోటీగా నగిరి నియోజకవర్గం నుంచి బరిలో దించడానికి బీజేపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.నగరి నియోజకవర్గంలో తెలుగుతో పాటు తమిళ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉండడంతో ఇక్కడ అభ్యర్థుల విజయంలో తెలుగు ప్రజలతో పాటు తమిళ ప్రజలు కూడా కీలకంగా ఉంటున్నారు.ఈ నేపథ్యంలో తెలుగు ప్రజలతో పాటు తమిళులకు కూడా బాగా పరిచయం ఉన్న ప్రియారామన్ను రోజాకు పోటీగా బరిలో దించడానికి బీజేపీ అధిష్టానం నిర్ణయించుకున్నట్లు సమాచారం..