పాక్‌ గూఢచారి అరెస్టు

పాక్‌ గూఢచారి అరెస్టు

జైపూర్‌: భారత పదాతి దళాల ఆర్మీ రహస్యాలను పాకిస్థాన్‌కు చేరవేస్తున్నారనే ఆరోపణపై జీపు డ్రైవర్‌ నవాబ్‌ఖాన్‌ను నిఘా విభాగం అధికారులు నిర్బంధించారు. నిందితుడి స్వస్థలం  రాజస్థాన్‌లోని జైస ల్మేర్‌.  రాజస్థాన్‌లోని ఇండియా-పాకిస్థాన్‌ సరిహద్దులో సంచరించి సమాచారాన్ని సేకరించి గుప్త లిపిలో (కోడ్‌ లాంగ్వేజ్‌)లోపాక్‌కు చేరవేసినట్లు అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇంటెలిజెన్స్‌ ఉమేష్‌ మిశ్రా మాధ్యమ ప్రతినిధులకుతెలిపారు.తెలిపారు. నిందితుడు నిరుడు గత ఏడాది పాకిస్థాన్‌ సందర్శించాడు. అప్పటి నుంచి అక్కడి ఐఎస్‌ఐతో సంప్రదింపులు జరుపుతున్నాడని చెప్పారు. పాక్‌ ఖాన్‌కు గూఢచర్యంలో శిక్షణ ఇచ్చి రహస్యాలు ఎలా పంపాలో నేర్పిందని  మిశ్రా వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos