బడుగు జనం గోడు మోదీకి అక్కర లేదు

బడుగు జనం గోడు మోదీకి అక్కర లేదు

న్యూఢిల్లీ : ప్రధాని మోదీ కేవలం ఆశ్రిత పెట్టు బడిదార్లు, బడా పారిశ్రామిక వేత్తలతోనే బడ్జెట్పై సంప్రదింపులు జరిపారని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ శుక్ర వారం ఇక్కడ ఎద్దేవా చేశారు. బడ్జెట్ రూపకల్పన గురించి ఎన్నడూ రైతులు, విద్యార్థులు, మహిళలతో సంప్రదింపులు జరపరని విమర్శించారు. ‘సూట్ బూట్ ప్రభుత్వానికి , రైతులు, విద్యార్థులు, ఉద్యోగులపై ఎంత మాత్రమూ శ్రద్ధ లేదు. కేవలం బడా పారి శ్రామిక వేత్తల ప్రయోజనాల పరిరక్షణకే సమావేశాలు నిర్వ హి స్తారు. మధ్య తరగతి, రైతుల గోడు ఆయనకు అక్కర లేద’ని మండి పడ్డారు. వార్షిక బడ్జెట్కు ముందు ఆనవాయితీగా పారిశ్రామి కులు, వాణిజ్య వేత్తలు, ఆర్థిక వేత్తలతో పాటు ఇతర రంగాలకు చెందిన నలభై మంది ప్రముఖులతో మోదీ గురువారం రెండు గంటల పాటు భేటీ అయ్యారు. ఇంతటి కీలక సమావేశానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరు కాలేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos