‘చౌకీ దారైన.. ఛాయ్ వాలా’

న్యూఢిల్లీ: గత ఎన్నికల్లో మాదిరిగా ప్రధాని మోదీ ఇప్పుడు ‘‘చాయ్వాలా’’ కాదు. ఆయన చాలా ‘‘మారి పోయారని’’ బిఎస్పీ అధినేత్రి మాయావతి మంగళవారం ఒక ట్వీట్లో వ్యాఖ్యానించారు. ‘మై భీ చౌకీ దార్ పేరుతో బీజేపీ ప్రచారాన్ని రంభించింది. ప్రధాన మోదీ సహా మిగతా వారంతా ట్విటర్లో తమ పేరుకు ముందు ‘చౌకీదార్’ అని చేర్చు కుంటున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో ‘చాయ్ వాలా’ గా ఉన్న నరేంద్ర మోదీ ఇప్పుడు ‘కాపలాదారు’ అయ్యారు. బీజేపీ పాలనలో దేశం ఎంత మార్పును చూస్తోంది. భలేవుంది’అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శనివారం ట్విటర్లో బీజేపీ ప్రారంభించిన ‘మై భీ చౌకీదార్’ ఉప శీర్షికతో ఇప్పటికే 20 లక్షల ట్వీట్లు పోస్టు అయ్యాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos