భోపాల్: కరోనా బారిన పడి తల్లిదండ్రులు చనిపోతే వారి పిల్లలు అనాథలుగా మారుతున్నారు. ఆ పిల్లలకు పెన్షన్ ఇవ్వాలని, అలాగే వారికి ఉచిత విద్య, రేషన్ కూడా అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇది ఇతర రాష్ట్రాలకూ అనుసరణీయం.