అవును… నా శరీర ఆకృతి మారిపోయింది

అవును… నా శరీర ఆకృతి మారిపోయింది

ముంబై : వయసుతో పాటు వచ్చే శారీరక మార్పులను మానసికంగా స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని యాహూ లైఫ్ తో ముఖా ముఖిలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా చెప్పింది.‘శారీరక మార్పులతో ఇబ్బంది పడుతున్నాననే అబద్ధాన్ని చెప్పలేను.. వయసు పెరుగుతున్నందున నా శరీరం చాలా మార్పులకు గురైంది. అందరి మాదిరే నా శరీరం కూడా మార్పు చెందుతోంది. వయసుతో వచ్చే మార్పులను ప్రతి ఒక్కరూ స్వీకరించాల్సిందే. నేనూ శారీరక మార్పులను స్వీకరిస్తున్నా. ఇప్పుడు నా శరీరం ఇలాగే ఉంది. ఇప్పుడున్న శరీరానికి మాత్రమే తాను తగు జాగ్రత్తలు తీసుకోగలను. 20 ఏళ్ల ,10 ఏళ్ల కిందటి దేహానికి కాద’ని తన దేహాన్ని తప్పుబట్టిన నెటిజెన్లకు బుద్ధి చెప్పింది. అమెరికన్ సింగర్ జొనాస్ ను పెళ్లాడిన తర్వాత ఆమె అక్కడే ఉంటోంది. ప్రస్తుతం ఆమె వయసు 38 సంవత్సరాలు, తన కంటే చిన్నవాడైన జొనాస్ ను ప్రేమించి పెళ్లాడింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos