మెహుల్ చోక్సీ మాయం

మెహుల్ చోక్సీ మాయం

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ)ను వంచించి అంటిగ్వా దీవిలో తలదాచుకుంటున్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ కనిపించకుండా పోయారని ఆయన తరపు న్యాయవాది విజయ్ అగర్వాల్ వెల్లడించాడు. ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం రాత్రి ఒక రెస్టారెంట్లో విందు కోసం వెళ్లిన ఆయన ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. ఆయన వాహనాన్ని రెస్టారెంట్ సమీపంలోని జాలీ హార్బర్లో అంటిగ్వా పోలీసులు గుర్తించారు. ఆయన కోసం వెతుకుతున్నారు. ఇండియాకు అప్పగిస్తారనే భయంతోనే ఆయన పరారైనట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇండియా-క్యూబా మధ్య నేరస్తుల అప్పగింతల ఒప్పందా లేవీ లేనందున అక్కడికి వెళ్లి ఉండొచ్చని పోలీసుల మదింపు. మెహుల్ చోక్సీ అంటిగ్వా, బార్బుడా పౌరసత్వం తీసుకున్నాడు. 2018లో పీఎన్బీ కుంభకోణం బయటపడడంతో నీరవ్మోదీ, మెహుల్ చోక్సీ దేశం విడిచి పారిపోయారు. నీరవ్ మోదీ, మేనమామే మెహుల్ చోక్సీ. మెహుల్ అప్పగింత గురించి అక్కడి ప్రధాని గాస్టోన్ బ్రౌన్, మన ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos