చీరాల : విద్యార్థి హత్య కేసుకు సంబంధించి నిందితులను పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ ఇక్కడి గడియారం సెంటర్లో ముస్లిం నాయకులు, యువకులు బుధవారం ఆందోళన చేపట్టారు. నిరసన చోటుకు పోలీసులు చేరుకొని ఆందోళనను విరమించాలని చెప్పారు.