తిరుపతి: బెయిల్ రద్దు కేసు నుంచి బయటపడేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి కేంద్ర మంత్రి కుమారుడి సాయం కోరుతున్నాడని కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతా మోహన్ వెల్లడించారు. సోమవారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడారు. ‘జగన్ బెయిల్ రద్దు కేసులో సీబీఐ తీరు వివాదాస్పదంగా ఉంది. త్వరలో రోజుల్లో జగన్ మాజీ కావడం తథ్యం. జగన్ రాజకీయ పతనం ప్రారంభమైనట్టే. రాష్ట్రంలో రాజకీయ మార్పు రాబోతోంద’న్నారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని లోక్సభ సభ్యుడు రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేయడం తెలిసిందే.