న్యూ ఢిల్లీ:పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పొరుగుదేశం పాకిస్థాన్‌ను భారత్ అన్ని విధాల నుంచి దిగ్బంధనం చేస్తోంది. ఇందులో భాగంగా సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆ జలాల నుంచి పాక్‌కు చుక్క నీరు కూడా వెళ్లకుండా చర్యలు తీసుకోనున్నట్లు కేంద్ర జలశక్తి మంత్రి ఇప్పటికే ప్రకటించారు. ఇందులో భాగంగానే తాజాగా చీనాబ్ నీటిని పాక్‌కు వెళ్లకుండా భారత్ చర్యలు తీసుకుంది. ఆ నదిపై నిర్మించిన సలాల్ జలాశయం గేట్లను అధికారులు మూసివేశారు. జమ్ము కశ్మీర్‌లోని రియాసి జిల్లాలో ఉన్న ఈ డ్యామ్ గేట్లను అధికారులు మూసివేయడంతో చుక్క నీరు పారక నదీ ప్రవాహక ప్రాంతం వెలవెలబోతోంది. ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.