న్యూఢిల్లీ: ఐపిఎల్ కొత్త స్పాన్సరర్గా డ్రీమ్11 అనే గేమింగ్ సంస్థ ఎంపికైంది. భారత, చైనాల మధ్య ఘర్షణ నేపథ్యంలో ఐపిఎల్ స్పాన్సర్షిప్ నుంచి చైనా సంస్థ వివో వైదొలిగిన విషయం తెలిసిందే. దాని స్థానంలో డ్రీమ్ 11 అనే సంస్థ ఏడాదికి 222 కోట్ల రూపాయలకు స్పాన్సర్షిప్ను దక్కించుకుంది. జైజుస్ 201 కోట్ల రూపాయలతో రెండో స్థానంలో, అన్అకాడమీ రూ.170 కోట్లతో మూడో స్థానంలో నిలిచాయి. అయితే కొత్త స్పాన్సర్ డ్రీమ్11లోనూ చైనా కంపెనీ టన్సెంట్ పెట్టుబడులు ఉండడం వివాదస్పదమౌతోంది. అయితే ఆ సంస్థ పెట్టుబడులు కేవలం పది శాతం మేరకే ఉన్నాయని, సంస్థ వ్యవస్థాపకులు, ఇతర వాటాదారులు, మొత్తం 400 మంది ఉద్యోగులంతా భారతీయులేనని బిసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. డ్రీమ్ 11 కంపెనీపై అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. గత నెలలో బిసీసీఐ అవినీతి నిరోధక విభాగం ఓ నకిలీ టీ20 లీగ్తో డ్రీమ్11కు సంబంధాలున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆ కంపెనీపై విచారణ చేయాలని పోలీసులను కోరింది. పంజాబ్లో జరిగిన ఆ లీగ్ను శ్రీలంకలో జరిగినట్లు లైవ్ స్ర్స్ట్రీమ్ చేశారు. లీగ్‌లో ఆటగాళ్లు వాడిన కిట్లపై డ్రీమ్ 11 లోగోలు ఉన్నట్లు, మ్యాచులను ఫ్యాన్‌కోడ్‌లో లైవ్ స్ర్స్ట్రీమ్ చేసినట్లు ఏసియూ విచారణలో తేలింది. డ్రీమ్ 11, ఫ్యాన్‌కోడ్లు రెండూ డ్రీమ్ స్పోర్ట్స్ గ్రూపులో భాగమే.