గౌహతి : లఢఖ్లోని సరిహద్దు రేఖ వద్ద చైనా యుద్ధ విమానాలు సంచరించినట్లు భారత్ వైమానిక దళాధికార్లు వారం రోజులు ఆలస్యంగా మంగళవారం మాధ్యమాల దృష్టికి వచ్చింది. భారత్, చైనా సైనికుల మధ్య సిక్కిం సరిహద్దుల్లో గొడవ జరిగినపుడు చైనా యుద్ధ విమానాలు లఢఖ్లో సంచరించాయని అధికార్లు వివరించారు. నియంత్రణ రేఖ వద్దకు చైనా విమానాలు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న భారత వైమానిక దళ విమానాలు వెంటనే అక్కడకు వెళ్లి గస్తీని తీవ్రం చేసాయని ప్రభుత్వ అధికారి ఒకరు విలేఖరులకు తెలిపారు. మన గగనతలంలోకి మాత్రం చైనా విమానాలు ంఒంఒయినితుహెలికాప్టర్లు ప్రవేశించలేదని వివరించారు. సాధా రణంగా ఆ ప్రాంత గగనతలంలో భారత్కు చెందిన సుఖోయి 30ఎంకేఐ యుద్ధ విమానాలతో గస్తీ నిర్వహిస్తారు. హంద్వారాలో హిజ్బుల్ ఉగ్రవాదులను భారత సైన్యం కాల్చి చంపిన తర్వాత దేశ తూర్పు సరిహద్దులో పాక్ యుద్ధ విమానాల సంచారం పెరిగిది. ఇదే సమయంలో చైనా కూడా ఇలాంటి దుస్సాహసానికి పాల్పడు తుండడం గమనార్హం.