వాణిజ్యం యుద్ధంలో కుదేలవుతున్న చైనా

వాణిజ్యం యుద్ధంలో కుదేలవుతున్న చైనా

బీజింగ్: అమెరికా, చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్యం యుద్ధం ముదురుతోంది సుంకాల కత్తుల్ని దూస్తున్నాయి. అమెరికా నుంచి ఎదురవుతున్న పన్నుల ఒత్తిడిని తట్టుకునేందుకు చైనా ఉత్పత్తి దార్లు అన్ని శక్తుల్ని ఒడ్డుతున్నారు. ఉత్పత్తి వ్యయం తగ్గింపునకు పలు చర్యల్ని చేపట్టారు. చైనా వస్తువుల్లో అత్యధికం విదేశాలకు ఎగుమతి అవుతోంది. వీటి వెల చౌక కావటంతో విదేశీ వ్యాపారులు వీటి దిగుమతికి మొగ్గు చూపుతున్నారు. చైనా నుంచి దిగుమతి అయ్యే అనేక వస్తువులపై అమెరికా సుంకాలను విపరీతంగా పెంచింది. దరిమిలా అమ్మకాల పెంపునకు చైనా ఉత్పత్తి దార్లు వస్తువుల ధరలపై రాయితీలు ఇస్తున్నారు. కార్మికుల సంఖ్యను తగ్గించి మరో దేశంలో వస్తువుల ఉత్పత్తి చేపట్టటం తదితరాల్నిఆరంభించింది. పన్నుకు పన్ను పద్ధతిలో సాగుతున్న వాణిజ్య యుద్ధం వల్ల అనేక వస్తువులు ప్రియ మయ్యాయి. యూరోపియన్‌ యూనియన్ సుంకాలు కూడా చైనా విద్యుత్‌ బైక్‌లు, సోలార్‌ ప్యానెల్స్ ధరల్ని ప్రభావితం చేసాయి. అమెరికా మార్కెట్ ఆధారంగా వస్తువులను తయారు చేస్తున్న సంస్థలు ప్రధానంగా కంపెనీలు మాత్రం ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాయి. వాణిజ్య యుద్ధానికి తెరపడకపోయనపుడు వ్యాపారం కొనసాగింపునకు ప్రత్యామ్నాయ ప్రణాళికల్ని కూడా సిద్ధం చేసుకున్నాయి. చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువుల ధరలను 10-15శాతం పెంచినట్లు కాలిఫోర్నియాకు చెందిన ఏసీవో పవర్‌ వ్యవస్థాపకుడు జెఫ్రీ టాంగ్‌ తెలిపారు. అన్ని పరికరాలను వియత్నాంకు పంపి అక్కడ అసెంబ్లింగ్‌ చేయిస్తున్నట్లు వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos