ఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సీబీఐ కస్టడీని సెప్టెంబరు రెండో తేది వరకు కోర్టు పొడిగించింది. ఇప్పటికే ఆయన సీబీఐ కస్టడీలో ఉన్నారు. శుక్రవారంతో గడువు ముగియడంతో ఇక్కడి ప్రత్యేక న్యాయ స్థానం ఎదుట హాజరు పరిచారు. విచారణలో ఆయన సహకరించడం లేదని, కనుక మరో నాలుగు రోజుల పాటు గడువు పొడిగించాలని సీబీఐ న్యాయవాది కోరారు. దీనికి కోర్టు అంగీకరించింది. అనంతరం ఆయనను సీబీఐ ప్రధాన కార్యాలయానికి తరలించారు.