కాంగ్రెస్ కార్యాలయంలో చిదంబరం

కాంగ్రెస్ కార్యాలయంలో చిదంబరం

ఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి పీ. చిదంబరం కొద్ది గంటలుగా అజ్ఞాతంలోకి వెళ్లి, బుధవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఏఐసీసీ కార్యాలయం వద్ద ప్రత్యక్షం కావడంతో అక్కడ నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చిదంబరం రాక గురించి తెలియగానే ఆయనను అదుపులోకి తీసుకునేందుకు సీబీఐ, ఈడీ బృందాలు అక్కడికి వచ్చాయి. తన లాయర్లతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న చిదంబరం తాను చెప్పాల్సింది క్లుప్తంగా చెప్పి, విలేకరుల  ప్రశ్నలకు సమాధానమివ్వకుండానే  వెళ్లిపోయారు. సీబీఐ, ఈడీ బృందాల రాకతో ఒక దశలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలు చిదంబరానికి అనుకూలంగా నినాదాలు చేశారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని, తన న్యాయవాదుల సూచన మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని చిదంబరం తెలిపారు. చట్ట పరిరక్షణ కోరానని, పిటిషన్ శుక్రవారం విచారణకు వస్తుందని అనుకుంటున్నానని చెప్పారు. తాను ఎక్కడికీ వెళ్లిపోలేదన్నారు. చట్టానికి కట్టుబడి ఉంటానని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos