ప్రేమను నిరాకరించదనే మనస్తాపంతో తాను ఎంతగా ప్రేమించింది యువతికి తెలియజేలాయనే కోరికతో ఓ వ్యక్తి చేసిన పని తమిళనాడు రాష్ట్రంలో చర్చనీయాంశమైంది.చెన్నై నగరంలోని నంగనల్లూర్ ప్రాంతానికి చెందిన కుమరేస పాండియన్(36) కార్పెంటర్ గా పనిచేస్తున్నాడు. కాగా.. తమ సమీమ బంధువైన 30ఏళ్ల మహిళను అతను రెండు సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడు. ఆమె కూడా అతనితో స్నేహంగా మెలిగేది. ఇటీవల కుమరేస తన ప్రేమను ఆమెకు తెలియజేశాడు.అయితే ఆమె అతని ప్రేమను నిరాకరించింది.అంతటితో ఆగకుండా కుమరేసతో మాట్లాడ్డం మానేసింది.సామాజిక మాధ్యమాల్లో సైతం కుమరేసను బ్లాక్ చేసి పూర్తిగా వదిలేసింది.దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కుమరేస బాధతో స్నేహితులతో కలసి మద్యం తాగి మత్తులో మద్యం సీసాను పగులగొట్టి తన ఎడమ చేతి మణికట్టును కోసుకున్నాడు. చేతి నుంచి కారుతున్న రక్తాన్ని మరొక సీసాలో నింపి ఈ విషయాన్ని మిగితా మిత్రులకు తెలియజేశాడు.కొద్ది సేటపి అనంతరం అక్కడికి చేరుకున్న స్నేహితులకు రక్తంతో నింపిన సీసాను ఇచ్చి తన ప్రియురాలికి బహుమతిగా ఇవ్వాలని చెప్పి స్పృహ కోల్పోయాడు. వెంటనే అతనిని స్నేహితులు ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.అయితే అప్పటికే ఆలస్యం కావడంతో కుమరేస మృతి చెందాడు.ప్రేమను నిరాకరించిందని కుమరేస చేసిన పని చెన్నై నగరంలో చర్చనీయాంశమైంది..