హోసూరు : ఇక్కడికి సమీపంలోని బాగలూరులో కరోనా నిరోధక చర్యలను ముమ్మరం చేశారు. బాగలూరులో కరోనా వ్యాది కి ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా నిరోధక చర్యలను ముమ్మరం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు బాగలూరులోని అన్ని వీధులలో క్రిమి సంహారక మందులను పిచికారీ చేశారు. బాగలూరు పంచాయితీ అధ్యక్షులు విడి. జయరాం, ఆరోగ్య శాఖ అధికారులు దగ్గరుండి బాగలూరులోని అన్ని వీధులలో క్రిమిసంహారక మందులను పిచికారీ చేయించడమే కాక మురికి కాల్వల శుభ్రం చేసి, చెత్తను తొలగించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మునిరాజ్, గుణశేఖర్ తదితరులున్నారు.