విజయవాడ: యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా కోసం “అంతర్జాతీయ ఫైటర్ క్రూతో ఇప్పుడే ఒక వెంటాడే సన్నివేశం చిత్రీకరణ ముగిసింది. ఐరోపాలో దీర్ఘ కాల చిత్రీకరణకు వెళ్లాల్సి వుంది. మరింత తాజా సమాచారాన్ని త్వరలోనే తెలియ జేస్తాన’ ని ప్రభాస్ మంగళవారం ట్వీట్ చేసారు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు ‘జాన్’ అనే పేరు పెట్టినట్లు ప్రచారం సాగుతోంది.