అనంతపురం : హిందూపురం లోక్‌సభ స్థానం నుంచి వైకాపా అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి గోరంట్ల మాధవ్‌కు మార్గం సుగమమైంది. ఆయన నామినేషన్ వేయడానికి అనువైన పరిస్థితులను కల్పించాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆయనను వెంటనే ఉద్యోగ విధుల నుంచి రిలీవ్ చేయాలని కూడా కర్నూలు డీఐజీకి ఉత్తర్వులు జారీ చేసింది. మాధవ్ జనవరిలోనే వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. దానిని ఇంకా ఆమోదించకపోవడంపై ఆయన హైకోర్టుకెళ్లారు. దీనిపై హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసినా, ఆయనపై రెండు ఛార్జి మెమోలు పెండింగ్‌లో ఉన్నాయని పోలీసులు కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు.