మాకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు..ఇస్రో

మాకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు..ఇస్రో

మరికొద్ది నిమిషాల్లో చంద్రుడిపై దిగనుందనగా ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌ 2లోని విక్రమ్‌ ల్యాండర్‌తో సంకేతాలు తెగిపోవడంతో భారత్‌తో పాటు ప్రపంచ దేశాలన్నీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.అప్పటి నుంచి విక్రమ్‌ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఇస్రో కొద్ది రోజుల క్రితం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ సహాయం తీసుకున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు.విక్రమ్‌ ఆచూకీ కనుగొనడానికి మూడురోజుల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో ఇక ల్యాండర్‌తో కనెక్ట్ అయ్యేందుకు ఉన్న ఆశలన్నీ క్రమంగా వదులుకుంటోంది.ఈ నేపథ్యంలో భారతీయులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇస్రో ట్వీట్‌ చేసిందిమాకు మద్దతుగా నిలిచినందుకు భారతీయులందరికీ దన్యావాదాలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల ఆశలు, కలలు స్ఫూర్తితో మేము మరింత ముందుకు సాగుతాం’. అని ఇస్రో ట్వీట్ చేసింది.అయితే ఈ విఫలం ఎలా తలెత్తింది అన్న అంశాన్ని పరిశీలించేందుకు ఓ అంతర్గత కమిటీని ఏర్పాటు చేసినట్లు ఇస్రో తెలిపింది. దీనికి గల కారణాలను మరో రెండురోజుల్లో వెల్లడిస్తామని పేర్కొంది. ఇప్పటికే ఆ కమిటీ రెండు సార్లు భేటీ అయిందని చెప్పిన ఇస్రో దాదాపు పూర్తిగా ఒక నిర్ధారణకు వచ్చేసిందని వెల్లడించింది. అధికారికంగా నివేదికను మరో రెండ్రోజుల్లో బహిరంగం చేయునున్నట్లు ఇస్రో చెబుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos