అమరావతి : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు 97 మందితో భద్రత కల్పించాలని హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 5 ప్లస్ 2 భద్రతను కొనసాగించాలని కూడా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఏర్పడ్డాక తనకు ఉద్దేశపూర్వకంగా భద్రతను తగ్గించారని ఆరోపిస్తూ చంద్రబాబు హైకోర్టుకెళ్లారు. బుధవారం దీనిపై ఉన్నత న్యాయ స్థానం తీర్పును వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం మేరకు ఒక ప్రధాన భద్రతాధికారిని మాత్రమే నియమించాలని, కాన్వాయ్‌లో జామర్‌ను కూడా అమర్చాలని ఆదేశించింది. కాగా చంద్రబాబుకు ప్రస్తుతం 74 మందితో ప్రభుత్వం భద్రత కల్పిస్తోంది.