లాఠీతో కొట్టిన పోలీసులకు అన్నం పెట్టిన రైతు..

లాఠీతో కొట్టిన పోలీసులకు అన్నం పెట్టిన రైతు..

అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ గతకొద్ది రోజులుగా అమరావతి ప్రాంత రైతులు,ప్రజలు నిరసనలు, ఉద్యమాలు చేస్తుండడంతో అమరావతిలో కొద్దిరోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.నిరసన చేస్తున్న రైతులు,ప్రజలపై పోలీసులు లాఠీచార్జ్‌లు సైతం చేస్తుండడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఈ నేపథ్యంలో లాఠీలతో కొట్టిన పోలీసులకు ఓ రైతు అన్నం పెడుతున్న వీడియోను తెదేపా అధినేత చంద్రబాబునాయుడు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడంతో వీడియో కాస్తా వైరల్‌గా మారింది.ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆర్డర్ వేస్తే లాఠీతో కొట్టిన పోలీసు సోదరులకు అన్నం పెట్టిమానవత్వానికి నిలువెత్తు నిదర్శనం అయ్యాడు రైతు. జై అమరావతి. నా రాజధాని అమరావతిఅని చంద్రబాబు నాయుడు ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.

YS Jagan Mohan Reddy ఆర్డర్ వేస్తే లాఠీతో కొట్టిన పోలీసు సోదరులకు అన్నం పెట్టి… మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం అయ్యాడు రైతు! జై అమరావతి! #MyCapitalAmaravati

Posted by Nara Chandrababu Naidu on Friday, January 10, 2020

తాజా సమాచారం

Latest Posts

Featured Videos