తెలంగాణ రాష్ట్రంలో
తెలుగుదేశం పార్టీ పూర్తిగా కనుమరుగవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు
నాయుడే కారణమంటూ తెదేపా మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు.తన స్వార్థ రాజకీయాల
కోసమే చంద్రబాబు తెలంగాణలో తెదేపాను బలి చేశారంటూ మండిపడ్డారు.చంద్రబాబు స్వార్థ రాజకీయాల
వల్ల తెలంగాణలో తెలుగుదేశం పార్టీనే నమ్ముకొని ఉన్న ఒకరిద్దరు నేతలు ఏమై పోవాలంటూ ప్రశ్నించారు.మాల,మాదిదలకు
ఏమి చేయలేని చంద్రబాబు కాపులకు ఏం చేస్తాడంటూ ప్రశ్నించారు.ఒకప్పుడు తెలంగాణలో ప్రశ్నించే
స్థితిలో ఉన్న తెలుగుదేశం ప్రస్తుతం కనుమరుగయ్యే పరిస్థితికి దిగజారడం వెనుక చంద్రబాబు
స్వార్థం,కుట్రలు ఉన్నాయని ఆరోపించారు.విభజన అనంతరం తెదేపా రాజకీయ పార్టీగా ఉంటుందని
భావిస్తే కేసుల్లో ఇరుక్కొని చంద్రబాబు పారిపోయారంటూ విమర్శించారు.చంద్రబాబు అవినీతి,అక్రమాలకు
అడ్డు అదుపు లేకుండా పోతోందని దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేశారు..