చంద్రబాబే మా కింద పనిచేశాడు..

చంద్రబాబే మా కింద పనిచేశాడు..

తెలంగాణ ముఖ్యమంత్రి
కేసీఆర్‌ గతంలో తనకింద పని చేశారంటూ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై
తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తీవ్రంగా స్పందించారు.అసలు
తెలుదేశం పార్టీలో చంద్రబాబు కంటే కేసీఆర్‌,తామే సీనియర్లమని చంద్రబాబునాయుడే మా కింద
పని చేశారంటూ మండిపడ్డారు.ఎన్టీఆర్‌ తెలుగుదేశం స్థాపించినప్పటి నుంచే కేసీఆర్‌,తాను
తెలుగుదేశంలో క్రీయాశీలకంగా వ్యవహరించామని ఆ సమయంలో కాంగ్రెస్‌లో ఉన్న చంద్రబాబు అవసరమైతే
ఎన్టీఆర్‌పై పోటీ చేసి గెలుస్తానంటూ బీరాలు పలికాడని ఈ విషమం చంద్రబాబుకు గుర్తు లేదా
అంటూ ప్రశ్నించారు.చంద్రబాబు తెలుగుదేశంలోకి వస్తానంటే కేసీఆర్‌తో పాటు నేను కూడా వ్యతిరేకించానని
అయితే ఎన్టీఆర్‌ చంద్రబాబుపై జాలి చూపి పార్టీలోకి తీసుకున్నారన్నారు. ఇదే అదునుగా
భావించిన చంద్రబాబు పార్టీలో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు
పొడిచి తెలుగుదేశం పార్టీని తన చేతుల్లోకి తీసుకున్నాడంటూ ఆరోపించారు.తెలంగాణలో తెలుగుదేశం
పార్టీ సర్వనాశనం కావడానికి చంద్రబాబే కారణమని తాను తెలంగాణ తెదేపా అధ్యక్షుడిగా ఉండగా
పార్టీలో కీలకనేత రేవంత్‌రెడ్డితో పాటు మరికొంతమందిని ఎగదోసి మాలో మాకే గొడవలు పెట్టి
పార్టీని నాశనం చేశాడని ఆరోపించారు.వచ్చే నెలలో ఆంధ్రప్రదేశ్‌లో జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో
తెలుగుదేశం ఓడిపోవడం తథ్యమని తెలంగాణలో పట్టిన గతే తెదేపాకు,చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్‌లో
కూడా పట్టనుందన్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos