చండీఘడ్: ఇండియా, పాకిస్థాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. చండీఘడ్‌లో ఇవాళ మరోసారి ఎయిర్ సైరన్(Air Sirens) మోగించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇండ్లలోనే ఉండాలని సైరన్ ద్వారా వ్యక్తపరిచారు. స్థానిక వైమానిక కేంద్రం నుంచి ఆ వార్నింగ్ వచ్చినట్లు తెలుస్తోంది. చండీఘడ్ ప్రాంతంలో దాడులు జరిగే అవకాశం ఉందన్న ఉద్దేశంతో సైరన్ వార్నింగ్ ఇచ్చారు. ఇండ్లలోపలే ఉండాలని, బాల్కనీలకు కూడా దూరంగా ఉండాలని స్టేట్మెంట్‌లో పేర్కొన్నారు. చండీఘడ్ ప్రభుత్వ యంత్రాంగం ఈ ప్రకటన చేసింది. ఇండియా, పాక్ ఉద్రిక్తల నేపథ్యంలో ఎయిర్ సైరన్ మోగిస్తున్నట్లు తెలిపారు.