పెంపు రూపాయే…వడ్డింపు రెట్టింపు

పెంపు రూపాయే…వడ్డింపు రెట్టింపు

ఢిల్లీ : బడ్జెట్‌లో సుంకాల పెంపు కారణంగా పెట్రోల్‌పై రూ.2.5, డీజిల్‌పై రూ.2.3 మేర పెరగనుంది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం రూపాయితో పాటు, మౌలిక సదుపాయాల సెస్ కింద మరో రూపాయి చొప్పున విధిస్తున్నట్లు ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రకటించారు. తాజా సుంకాలకు వ్యాట్‌ను  కలిపితే పెట్రోల్ రూ.2.5, డీజిల్ రూ.2.3 మేర పెరిగే అవకాశం ఉంది. వీటితో పాటు క్రూడ్ ఆయిల్‌పై టన్నుకు రూపాయి చొప్పున దిగుమతి సుంకాన్ని విధించారు. ప్రస్తుతం ఏటా 220 మిలియన్ టన్నుల క్రూడాయిల్‌ను భారత్ దిగుమతి చేసుకుంటోంది. దీని వల్ల కూడా ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరనుంది. క్రూడాయిల్‌పై ఇప్పటిదాకా ప్రభుత్వం ఎలాంటి సుంకమూ విధించడం లేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos