భారత్ కు చెందిన క్షిపణి విఫలమైందంటూ అవాస్తవాలు ప్రచారం చేసిన నేపాల్ కు చెందిన ఓ నెటిజెన్ మరోసారి భారత్ పై అక్కసు వెళ్లగక్కాడు.వైమానిక దాడులు చేసేందుకు భారత యుద్ధ విమానం ఒకటి నేపాల్ సరిహద్దులు దాటి వచ్చిందని, ఆ భారత యుద్ధ విమానాన్ని నేపాల్ కూల్చివేసిందని ఆ వార్త సారాంశం.కోట్ ఖరాక్ సింగ్ పెర్నవాన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని, భారత్ వైమానిక దాడులకు ప్రతిగా నేపాల్ కూడా దీటుగా స్పందించి ఓ జెట్ ఫైటర్ ను కూల్చివేసిందని, ఇద్దరు భారత పైలెట్లు మృతి చెందారని ఆ వార్తలో పేర్కొన్నారు. దీనిపై కేంద్ర సమాచార శాఖ స్పందించింది. ఇది ఫేక్ న్యూస్ అని స్పష్టం చేసింది. భారత వైమానిక దళం ఏ పొరుగుదేశంపైనా దాడికి పాల్పడలేదని, వైరల్ అవుతున్న వార్తలోని ఫొటోలు పాతవి అని, దుష్ప్రచారం చేసే వాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.
Claim: A viral message on twitter claiming that an Indian Airforce jet has been shot down. #PIBfactcheck: It's #Fake. No such claimed action has been conducted by Indian airforce on any neighbouring country. The images used are from a previous date. Beware of panic mongers. pic.twitter.com/joOFc4WVff
— PIB Fact Check (@PIBFactCheck) July 24, 2020