న్యూఢిల్లీ : ‘సెంట్రల్ విస్టా ముఖ్యం కాదు. దూరదృష్టి, దార్శనికతలతో కూడిన కేంద్ర ప్రభుత్వం చాలా ముఖ్యమ’ని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం చేసిన ట్వీట్లో ప్రధాని మోదీకి చురకలంటించారు. ‘సామాన్యులు ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారు. ఎవరి మనసునైనా ఆకట్టుకోవాలంటే, వారి చేతులను తాకవలసిన అవసరం లేదని నిరూపిస్తున్నారు. సాయం చేసే చేతులను పెంచుకుంటూ పోవాలి. ఈ గుడ్డి వ్యవస్థ నిజ స్వరూపాన్ని బయటపెట్టాల’ని న్నారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కొత్త పార్లమెంటు భవనం, పార్లమెంటరీ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలను న్యూఢిల్లీలోని రైజినా హిల్ వద్ద నిర్మిస్తున్నారు. కొన్ని వారసత్వ కట్టడాలను ఆధునికీకరి స్తున్నారు. 2020 డిసెంబరులో కొత్త పార్లమెంటు భవనానికి శంకుస్థాపన జరిగింది. ఈ ప్రాజెక్టు 2021 నవంబరు 30లోగా పూర్తికావలసి ఉంది. దేశంతోపాటు ఢిల్లీలో కోవిడ్-19 మహమ్మారి రెండో ప్రభంజనం విజృంభిస్తోంది. ఢిల్లీలో అష్టదిగ్బంధనం అమలవుతున్న సమయంలో సైతం ఈ ప్రాజెక్టును అత్యవసర సేవలుగా ప్రకటించి, పనులు కొనసాగిస్తున్నారు.