గ్యారంటీ లేకుండా రుణం ఇస్తున్న కేంద్రం.. అర్హతలు ఇవే..

గ్యారంటీ లేకుండా రుణం ఇస్తున్న కేంద్రం.. అర్హతలు ఇవే..

కరోనా వైరస్ దెబ్బకి చాలా మంది గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఉపాధి కోల్పోవడం, ఆదాయం లేకపోవడం ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ ద్వారా అర్హులైన వారికి సులభంగానే రుణాలు అందిస్తోంది.మోదీ సర్కార్ స్వనిధి యోజన స్కీమ్ కింద లబ్ధిదారులకు నేరుగానే రుణాలు అందిస్తోంది. దీని కోసం మీరు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఇంట్లో నుంచే దరఖాస్తు కూడా చేసుకోవచ్చు. దీని కోసం పీఎం స్వనిధి యోజన వెబ్‌సైట్‌కు వెళ్లాలి. ఈ వెట్‌సైట్‌ ద్వారా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.వెబ్‌సైట్ నుంచి వద్దనుకుంటే.. స్మార్ట్‌ఫోన్ ద్వారా మొబైల్ యాప్‌తో కూడా లోన్ కోసం అప్లై చేసుకునే వెసులుబాటు అందుబాటులో ఉంది. మోదీ సర్కార్ ఇటీవలనే పీఎం స్వనిధి స్కీమ్ వెబ్‌సైట్‌ మాదిరిగానే మొబైల్ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఈ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.పీఎం స్వనిధి యోజన మొబైల్ యాప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పని చేస్తుంది. యాప్‌లోనే ఇకేవైసీ, అప్లికేషన్ ప్రాసెసింగ్, రియల్‌టైమ్ మానిటరింగ్ వంటి ఫీచర్లు చాలానే ఉన్నాయి. వీధి వ్యాపారులు పీఎం స్వనిధి స్కీమ్ కింద రుణం పొందటానికి అర్హులు. రూ.10,000 వరకు రుణాన్ని సులభంగానే పొందొచ్చు.ఇకపోతే స్వనిధి స్కీమ్ కింద రుణం తీసుకున్న వారు లోన్ మొత్తాన్ని క్రమం తప్పకుండా చెల్లిస్తూ వస్తే.. పలు ప్రయోజనాలు పొందొచ్చు. రుణ వడ్డీ రేటుపై 7 శాతం వరకు సబ్సిడీ లభిస్తుంది. అలాగే మళ్లీ కొత్త రుణాలు తీసుకోవడం ఈజీగా ఉంటుంది. అందువల్ల తీసుకున్న రుణాన్ని సక్రమంగా కట్టేలా చూసుకోండి. కాగా http://pmsvanidhi.mohua.gov.in/ వెబ్‌సైట్ ద్వారా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos