దక్షిణ తిరుపతి దేవాలయానికి సిమెంట్ రోడ్డు

దక్షిణ తిరుపతి దేవాలయానికి సిమెంట్ రోడ్డు

హోసూరు : ఇక్కడికి సమీపంలోని గోపసంద్రం వద్ద గల దక్షిణ తిరుపతి దేవాలయానికి వెళ్లే దారికి సిమెంట్ రోడ్డు నిర్మాణానికి గాను డీఎంకే పార్టీ జిల్లా కార్యదర్శి వై. ప్రకాష్ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. కృష్ణగిరి జిల్లా సూలగిరి యూనియన్‌లోని గోపసంద్రం వద్ద  పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందిన దక్షిణ తిరుపతి దేవాలయం వద్దకు వెళ్లడానికి సిమెంట్ రోడ్డు నిర్మించడానికి వేపనపల్లి శాసన సభ్యుడు మురుగన్ ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.5 లక్షలు కేటాయించారు. అందులో భాగంగా సిమెంట్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తళి ఎమ్మెల్యే, డిఎంకె పార్టీ జిల్లాకార్యదర్శి వై. ప్రకాష్ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో హోసూరు ఎమ్మెల్యే ఎస్.ఏ. సత్య, డిఎంకె పార్టీ నాయకులు రషీద్, నాగేష్, కృష్ణమూర్తి, ఉద్ధనపల్లి స్టాలిన్ తదితరులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos