రాజాసింగ్‌కు సీఈసీ నోటీసు

రాజాసింగ్‌కు సీఈసీ నోటీసు

న్యూఢిల్లీ: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా యోగీ ఆదిత్యనాథ్‌కు ఓటు వేయకుంటే బుల్డోజర్లు సిద్ధంగా ఉన్నాయంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆ సమయంలోపు ఆయన వివరణ ఇవ్వకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామని ఈసీ వెల్లడించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos