ఉపరాష్ట్రపతి ఎన్నిక కు అధికారుల నియామకం

ఉపరాష్ట్రపతి ఎన్నిక కు అధికారుల నియామకం

న్యూ ఢిల్లీ: జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామాతో ఖాళీ ఏర్పడిన దేశ అత్యున్నత స్థానం ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ఎన్నికల నిర్వహణలో భాగంగా ఆర్వో, అసిస్టెంట్‌ ఆర్వోను తాజాగా నియమించింది. రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులను నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖతో సంప్రదించి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ అంగీకారంతో రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ పీసీ మోదీని రిటర్నింగ్‌ అధికారిగా నియమించింది. ఇక రాజ్యసభ సెక్రటేరియట్ జాయింట్ సెక్రటరీ గరిమా జైన్, సెక్రటేరియట్ డైరెక్టర్ విజయ్ కుమార్‌లను సహాయ రిటర్నింగ్‌ అధికారులుగా నియమించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos