మోదీ ప్రసంగం సబబే: ఎన్నికల సంఘం

న్యూఢిల్లీ :ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ప్రయోగం విజయవంతమైనట్లు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం ఎన్నికల ప్రవర్తనా నియమావళికి వ్యతిరేకం కాదని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఇక్కడ తేల్చి చెప్పింది. తన పార్టీ- భాజపా పేరును ఎక్కడా ప్రస్తావించక పోవటంతో బాటు ఆ పార్టీ అభ్యర్థులకే ఓట్లేయాలని కోర నందున ఆయన ప్రసంగం ఎన్నికల ప్రవర్తనా నియమావళికి ఎన్నికల సంఘం నియమించిన ప్రత్యేక సమితి తన విచారణలో స్పష్టీక రించింది. మోదీ ప్రయోగాన్ని తమ ప్రభుత్వ విజయంగా గొప్పలు చెప్పుకున్నారని , జాతీయ భద్రతకు సంబంధించిన అత్యవసర అంశమే కాదని విపక్షాలు మోదీ ప్రసంగాన్ని తప్పుబట్టాయి. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos