
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పటికీ రైల్వే, విమాన ప్రయాణికులు టిక్కెట్లపై ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాలను తొలగించనందుకు సంజాయిషీ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం సంఘం రైల్వే మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన శాఖలకు తాఖీదుల్ని జారీ చేసింది. మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మార్చి 10 నుంచి ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. నియమావళి ప్రకారం, రాజకీయ నాయకుల ఫోటోలు, వారి పేర్లు, పార్టీ చిహ్నాలను ప్రభుత్వ ఖర్చుతో ప్రచారం చేయకూడదు