ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జగ్గీ వాసుదేవన్ జలసంరక్షణకు సంబంధించి కావేరి కాలింగ్ పేరుతో ప్రారంభించిన ఉద్యమంలో అక్కినేని కోడలు సమంత కూడా భాగమైంది.ఉద్యమంలో భాగంగా లక్ష మొక్కల్ని నాటే ప్రక్రియకు శ్రీకారం చుట్టిన స్యామ్ అందుకోసం తన అభిమానుల సహకారం కోరారు. ”కావేరీ పిలుస్తోంది. మీరు స్పందిస్తారా.. http://samantha.cauverycalling.org వెబ్‌సైట్‌లో మీ విరాళాలు అందించండి. మీరు, నేను కలిస్తే.. లక్ష మొక్కల్ని నాటేందుకు సహకరించగలం” అంటూ తన పోస్ట్ లో రాసుకొచ్చింది.దీంతోపాటు ప్లకార్డు పట్టుకుని ఉన్న వీడియోను కూడా షేర్ చేశారు. ప్రతి మనిషి రూ.42 విరాళంగా ఇవ్వడం ద్వారా ఓ మొక్క నాటినవారవుతారని చెప్పారు. ప్రస్తుతం భూమిలో జలవనరులు అడుగంటుతున్నాయని..నీటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆలోచించినప్పుడు తనకు దొరికిన సమాధానం కావేరీ కాలింగ్ అని చెప్పారు..