క్షుద్బాధ తట్టుకోలేక కుళ్లిన కుక్క మాంసం తినేశాడు..

క్షుద్బాధ తట్టుకోలేక కుళ్లిన కుక్క మాంసం తినేశాడు..

దేశంలో ఎప్పుడూ చూడని ఘటనలు కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ కారణంగా చోటు చేసుకుంటున్నాయి.ఇళ్లకు చేరుకునే క్రమంలో పదుల సంఖ్యలో వలస కూలి కార్మికుల మరణాలు,ఆకలి మరణాలు ఇలా ఎన్నో హృదయ విదారక ఘటనలు చోటు చేసుకున్నాయి ఇప్పటికీ చోటు చేసుకుంటూనే ఉన్నాయి.కొద్ది రోజుల క్రితం ఒక బిస్కట్‌ ప్యాకెట్‌ కోసం వలస కూలి కార్మికులు కొట్టుకున్న ఘటన మరువక ముందే క్షుద్భాద తట్టుకోలేక ఓ వ్యక్తి రోడ్డుపై కుళ్లిన స్థితిలో ఉన్న కుక్క మాంసం తిన్న ఘటన చర్చనీయాంశమైంది. జైపూర్ జిల్లా షాపురా వద్ద ఢిల్లీజైపూర్ జాతీయ రహదారిపై వ్యక్తి ప్రమాదంలో చనిపోయిన కుక్కను తింటూ ఆకలి తీర్చుకుంటూ కనిపించాడు. అటుగా వెళ్తున్న ప్రయాణికులు దీన్ని గమనించారు. బాధితుడిని ప్రద్యుమ్న సింగ్ నరూకా అనే వ్యక్తి.. దీన్ని ఎందుకు తింటున్నావని ప్రశ్నించాడు. తినడానికి తిండి లేదని, ఆకలి తట్టుకోలేక ఇలా చేస్తున్నట్టు చెప్పాడు. వెంటనే తన వాహనంలో ఉన్న ఆహారం ప్యాకెట్ను ఇచ్చి అతడి ఆకలి తీర్చాడు. మరోసారి ఇలా కళేబరాన్ని తినకూడదని సూచించాడు.చాలా సేపటి నుంచి అతడు అలా రోడ్డుపై కుక్క మృతదేహాన్ని తింటూ ఉన్నా కనీసం ఎవరూ పట్టించుకోలేదని వ్యక్తి ఆవేదన చెందాడు. దీనికి సంబంధించిన వీడియోను ప్రద్యుమ్న షేర్ చేస్తూ.. ఇది మానవత్వానికే సిగ్గుచేటు అంటూ అభిప్రాయపడ్డారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos