పారిస్ : ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు
పొందిన ఫ్యాషన్ డిజైన్ హాట్కౌచ్. దాని రూపశిల్పి కార్ల్ లాగర్ఫెల్డ్. 85 ఏళ్ల
వయసులో మంగళవారం ఆయన కన్నుమూశారు. ఆయన వద్ద ఓ పెంపుడు పిల్లి ఉంది. బర్మీస్ జాతికి
చెందినది. దానిని ఆయన ముద్దుగా పౌపెట్ అని పిలుచుకునే వారు. ఈ పిల్లి జపనీస్ కాస్మోటిక్స్
బ్రాండ్ ప్రకటనల్లో, జర్మన్ కార్ల ప్రకటనల్లో కనిపించడం ద్వారా 3.4 మిలియన్ డాలర్లను
సంపాదించింది. లాగర్ఫెల్డ్ సంపాందించిన ఆస్తిలో ఈ పిల్లికి దాదాపు 20 కోట్ల డాలర్లు
(సుమారు రూ.14 వేల కోట్లు) దక్కవచ్చని తెలుస్తోంది.